Thursday, June 25, 2020

అనగనగా JNTU కళాశాల లో....... పుణ్యమైన పులివెందుల లో

పులివెందుల లొ పులి ఉందో లేదో కాని...
ఆ JNTU కళాశాలకి ఒక మంచి కళ ఉంది..

ఆ కళాశాల చూశాక .. ఒక్కసారిగా నా తనువు పులకరించింది..
పంజరం లో ఉన్న చిలకను అడవిలో వదిలినట్లైంది.

వర్షపు నీటికి మట్టిలోనుండి వచ్చే సువాసన
కొత్తవారిని పరిచయం చేసుకున్నాక వచ్చే ఆనందం .... చాలా ఆహ్లాదకరంగ ఉండింది.. 

ఒక సాయంత్రం అలా మైదానంలో వెళుతుండగా..... 
రోజంతా విశ్వానికి వెలుగు ఇచ్చిన భానుడు ఇంటికి పరుగులు తీస్తున్నాడు.
ఆకాశంలో మేఘాలు ఒకదాన్ని ఒకటి తరుముకుంటున్నాయి.  
చెట్లు నుండి వచ్చే గాలి..
           చిన్నారుల చిరునవ్వు అంత స్వచ్ఛంగా ఉండేది. .   

రాత్రి వేళ లో... దివి అంతా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి,తారలు ఆ మేఘాల మధ్య దాగుడుమూతలు ఆడుతున్నాయి...
చంద్రుడు ని మబ్బులు చుట్టుముట్టేశాయి... 

ఒక్కసారిగ జీమూతం కరిగి పుడమి కి చేసుకున్నాయి... 
ధరణి దాహం తీర్చుకుంది....
చుట్టూ అంధకారం చుట్టేసింది..
తిమిరంలొ చలిచలము, వాగువంక, అంభుధి ఆనందంతో పొంగిపోయాయి...

రాత్రంత నిద్రిస్తున్న రవి తిరిగిరానేవచ్చాడు. 
సూర్యరశ్మి  అవనికి చేరుతున్న సందర్భంలొ..
వృక్షాలలోని పచ్చని పత్రాలు పులకరించాయి. 

ఉదయం పూట చెట్లులో పక్షుల రాగాలు, కోయల గానాలు , శ్రీ కృష్ణడి పిల్లనగ్రోవి వలే మోగుతుండేవి..

స్నేహితుల ఆటలపాటలతో వసతి గృహం నుండి తరగతి గదికి చకచకా చేరుకున్నాము.

సీనియర్స్ చేసే ర్యాగింగ్...
  కళాశాల క్యాంపస్ ని అలంకరించి నట్లూ చేసేది

ఆ తరగతి గదిలో....
నాలుగు దిక్కులున్న ప్రపంచ్చాన్ని..
నాలుగు గోడల మద్య ఉంచినట్లుండేది.

తరగతి గదిలో పడుకుంటె ...
గగన వీధుల్లో మహా విష్ణువు పానుపు పైన పడుకున్నట్లుందేది...

ఆడపడుచులను హరివిల్లులోని అందాలతొ పోల్చడానికి నాకు అతిశయోక్తి సరిపోలేదు.
ప్రపంచంలో ఉన్న రంగులన్నీ... ఒక చోటికి చేర్చితె ఎలా ఉంటుందో.. అంత అందంగా అలంకరించినట్లుంది.


ఆ చల్లని వాతావరణంలో ఉపాధ్యాయుల పాఠాలు వింటుంటే..... 
పుష్పక విమానం లో గగన ప్రయాణం చేస్తున్నట్లు ఉండేది.
అలా.. రోజులు గడుస్తున్నాయి.... 

అన్నీ ఉన్నా కూడా.. ఏదో తెలియని లోటు...
మనిషి ఇక్కడే ఉన్న....
    మనస్సు ఎక్కడెక్కడికో పరుగులు తీస్తుంది 
    ఆలోచనలు ఆకాశాన్ని తాకుతున్నాయి..
 
అలా నీటి ప్రవాహం లాగ నిలకడగా లేని నా జీవితానికి
ఒక్కసారిగా ఆనకట్ట కట్టినట్లుఅయింది

అప్పటి  వరకు  My life is 
Full of Miracles and Surprises లాగ ఉండేది  
But... అప్పటి నుండి  ("అనుకోకుండా ఆరోజు") 
నా  life Full of Happiness and Emotions ga మారుతుందని  అనుకోలేదు 


                                       అనుకోకుండా ఆ రోజు 
                                         అతి త్వరలో....... 

5 comments:

వచ్చాయి వానలు.💧☔💧 ....గుర్తొచ్చాయి నాలోని జ్ఞాపకాలు😍😍

వచ్చాయి ఋతుపవనాలు .... తెచ్చాయి ప్రకృతికి అందాలు...... బురదలో అడుగులు   బూడిదలో నీటి చుక్కలు   ఆకాశంలో మెరుపులు   నేలపై నీటి గుంటలు   కొండ చ...