Wednesday, October 20, 2021

వచ్చాయి వానలు.💧☔💧 ....గుర్తొచ్చాయి నాలోని జ్ఞాపకాలు😍😍

వచ్చాయి ఋతుపవనాలు....
తెచ్చాయి ప్రకృతికి అందాలు......

బురదలో అడుగులు 
బూడిదలో నీటి చుక్కలు 
ఆకాశంలో మెరుపులు 
నేలపై నీటి గుంటలు 
కొండ చరియల్లో నీటి ఊటలు 
కోనల్లో ఉభయచరాల శబ్దాలు
సంధ్యాకాలంలో కోయిల గేయాలు  
సాయంకాలంలో తూనీగల రాగాలు 
వర్ణించలేని ప్రకృతి అందాలు 
ఊహించని విద్యుత్ ప్రమాదాలు 
చకోర పక్షి ఎదురు చూపులు 
మేఘాల మధ్య చంద్రుని కొంటె చూపులు 
ఢమ.. ఢమా అని ఉరుములు మెరుపులు
క్యార్.. క్యార్ అని  పిల్లల ఏడుపులు


జంతువులు చెట్ల కింద ఒరెగినె 
వడగండ్లు కాలకింద కరిగినె
గొడుగు పువ్వై విచ్చుకొనె
ముసలి వాళ్ళు ఇంట్లో మొగ్గై ముడుచుకొనె


చుక్కలు శూన్యమాయే 
సూర్యుడు శాపమాయే

పేపర్లు పడవలై ప్రవహించే 
కొబ్బరి ఆకులు రాకెట్లై ప్రయాణించే 

వాలిన చెట్లు
రాలిన కాయలు 
కూలిన ఇళ్లు
మునిగిన పడవలు 

ఇలా ఎన్నో ఆశ్చర్యాలు ఇంకెన్నో అద్భుతాలు
ఊహించని పరిణామాలు, ఊహించే పరిణయాలు 
గుర్తొచ్చే సందర్భాలు గుర్తుండి పోయే సంఘటనలు.....

వచ్చాయి ఋతుపవనాలు....
తెచ్చాయి ప్రకృతికి అందాలు......


రాలాయి తొలకరి చినుకులు 
గుర్తొచ్చాయి చిలిపి పనులు.
ప్రయాణించే నీటి ప్రవాహాలు
పులకరించే నాలోని చిన్ననాటి జ్ఞాపకాలు 

ఇలా వాన పోయే వంకకు 
నా కవిత్వం పోయే కంచెకు
 

Thursday, July 30, 2020

FRIEND IS FRIEND ...... UNTIL OUR LIFE END

FRIEND...Life long మనతో  ఉండే Emotion & Entertainment.

జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకు ఒకే పేరు పెడతారు. 
But Friends
    మామ-మచ్చా అని 
    బావ-బామర్ది అని 
    బాబాయ్-Dude అని 
   ఒసేయ్-పిల్లా-వే (Girls) అని 
నచ్చిన పేర్లు,నోటికొచ్చిన పేర్లు పెడతారు.
అమ్మ-నాన్నలు పెట్టిన పేర్లు పిలిచినప్పుడు అమ్మ-నాన్నలు గుర్తువస్తారో రారో కానీ,
Friends పెట్టిన పేర్లు పిలిచినప్పుడు కచ్చితంగా Friends గుర్తొస్తారు.

నడక కుటుంబ సభ్యుల దగ్గర నేర్చుకుంటాము.
నడవడిక స్నేహితులు దగ్గర నేర్చుకుంటాము.

కొట్లాడుకుంటాం.. తిట్టుకుంటాం  ఒకటై పోతాం ...
ఒకరి పైన ఒకరం కోపడటం సహజం
అయినా...మనకిష్టమైన వాళ్ళపైనే కదా మనం ఎక్కువగా కోపం చూపిస్తాము. 
స్నేహితులు అంటే ఎవరు... మన హితాన్ని కోరుకునేవారు 
తిట్టి చెప్పిన, కొట్టి చెప్పిన మన మంచికే కదా.

ఇప్పటికీ గుర్తున్నాయి.... 
ఒకరి పై ఒకరం వేసుకున్న కుల్లు జోకులు
చూసిన సినిమాలు 
తిన్న బిర్యానిలు, తిరిగిన దాభాలు
కలిసి చేసిన తులవ పనులు 
Back Bench Bunking లు
Front Bench Sleeping లు
ఇతరుల పైన వేసిన Comment లు.

Friendship అంటే Sharing అన్నారు నిజమే 
Exams లో Answers Sharing
Mobiles లో Movies Sharing 
Whatsapp లో Girls & Boys Numbers sharing 
Food Sharing , Bed Sharing 
ఇలా చెప్పడానికి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి.. 

అందుకే అన్నారేమో
వాడిపోనిది స్నేహం ఒక్కటే అని,
Trend మారినా Friend మారడని. 


We may build A House without Bricks 
But we can't build our life without FRIENDS 

మన స్నేహము 
శ్రీ కృష్ణ - కుచేలుడు అంత గొప్పది కాకపోవచ్చు 
శ్రీ రామ - సుగ్రీవుడు ని మించిది కాకపోవచ్చు
కలువ - చంద్రుడు కన్నా అందమైనది కాకపోవచ్చు
But.... 
నీటి తో స్నేహం చేసి నీటికి కరిగిపోయే మట్టిపెల్ల  అంత బలహీనమైనది అయితే కాదు. 

నీ Life లో నేను Important కాకపోవచ్చు... 
But you have a Special priority in my life.
కొద్ది రోజుల తర్వాత మనం కలిసినప్పుడు ....
చేసిన చిలిపి పనులు,అల్లరి గుర్తుకురావాలి.... 
అంతే కానీ .... 
 ఎప్పుడో  కళాశాల/పాఠశాల నుండి విడిపోయేటప్పుడు కార్చిన కన్నీరు గుర్తుకు రాకూడదు.

Of course కొద్ది రోజులకి నువ్వు నీ Life లో Busy అయిపోతావు,
నా నుంచి దూరంగా వెళ్లిపోతావు,Even Contact లో కూడా ఉండకపోవచ్చు
కానీ...
నేను గుర్తు వచ్చినప్పుడు నీ ముఖం లో చిరునవ్వు వస్తాది కదా ఆ చిరునవ్వులో నేనెప్పుడు నీతోడుగ ఉంటాను.

Tuesday, July 7, 2020

"I" have only "LOVE" and searching 7for "YOU"

I kept you alive in my poetry 🥰😍
I may end /my poetry may end..... 
But the words which  describes you   doesn't end



I saw Beauty in you... Not in your  face... In your Heart  💖 

If you want to Feel poetry.. 
You should fall in love once in your life .

      Every time I fall in love with you 
        I have only  found  love but  you are not 


You're the reason for my smile Today 

If am A tune 
  You're my lyrics... 
Trust me I am incomplete without you.. 

You're the best thing happen to me in my life 

Our love is Incomplete 
      Yet Beautiful... 
We are not living together 
     But made for each other...
                       Will you be the rest of my life?

Every story has an end
I hope you will give a beautiful Conclusion to my Love with your re-entry into my life.

I hid you Between  my heartbeat
Before you leave my heart ... my soul will forsakes me

I hope one day you will read my Poetry 
And realize that they  all are about you 😔

Zero  is nothing until a decimal value in its left position... 
I am also Nothing until your little finger holds my little finger.. 

Thursday, June 25, 2020

అనగనగా JNTU కళాశాల లో....... పుణ్యమైన పులివెందుల లో

పులివెందుల లొ పులి ఉందో లేదో కాని...
ఆ JNTU కళాశాలకి ఒక మంచి కళ ఉంది..

ఆ కళాశాల చూశాక .. ఒక్కసారిగా నా తనువు పులకరించింది..
పంజరం లో ఉన్న చిలకను అడవిలో వదిలినట్లైంది.

వర్షపు నీటికి మట్టిలోనుండి వచ్చే సువాసన
కొత్తవారిని పరిచయం చేసుకున్నాక వచ్చే ఆనందం .... చాలా ఆహ్లాదకరంగ ఉండింది.. 

ఒక సాయంత్రం అలా మైదానంలో వెళుతుండగా..... 
రోజంతా విశ్వానికి వెలుగు ఇచ్చిన భానుడు ఇంటికి పరుగులు తీస్తున్నాడు.
ఆకాశంలో మేఘాలు ఒకదాన్ని ఒకటి తరుముకుంటున్నాయి.  
చెట్లు నుండి వచ్చే గాలి..
           చిన్నారుల చిరునవ్వు అంత స్వచ్ఛంగా ఉండేది. .   

రాత్రి వేళ లో... దివి అంతా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి,తారలు ఆ మేఘాల మధ్య దాగుడుమూతలు ఆడుతున్నాయి...
చంద్రుడు ని మబ్బులు చుట్టుముట్టేశాయి... 

ఒక్కసారిగ జీమూతం కరిగి పుడమి కి చేసుకున్నాయి... 
ధరణి దాహం తీర్చుకుంది....
చుట్టూ అంధకారం చుట్టేసింది..
తిమిరంలొ చలిచలము, వాగువంక, అంభుధి ఆనందంతో పొంగిపోయాయి...

రాత్రంత నిద్రిస్తున్న రవి తిరిగిరానేవచ్చాడు. 
సూర్యరశ్మి  అవనికి చేరుతున్న సందర్భంలొ..
వృక్షాలలోని పచ్చని పత్రాలు పులకరించాయి. 

ఉదయం పూట చెట్లులో పక్షుల రాగాలు, కోయల గానాలు , శ్రీ కృష్ణడి పిల్లనగ్రోవి వలే మోగుతుండేవి..

స్నేహితుల ఆటలపాటలతో వసతి గృహం నుండి తరగతి గదికి చకచకా చేరుకున్నాము.

సీనియర్స్ చేసే ర్యాగింగ్...
  కళాశాల క్యాంపస్ ని అలంకరించి నట్లూ చేసేది

ఆ తరగతి గదిలో....
నాలుగు దిక్కులున్న ప్రపంచ్చాన్ని..
నాలుగు గోడల మద్య ఉంచినట్లుండేది.

తరగతి గదిలో పడుకుంటె ...
గగన వీధుల్లో మహా విష్ణువు పానుపు పైన పడుకున్నట్లుందేది...

ఆడపడుచులను హరివిల్లులోని అందాలతొ పోల్చడానికి నాకు అతిశయోక్తి సరిపోలేదు.
ప్రపంచంలో ఉన్న రంగులన్నీ... ఒక చోటికి చేర్చితె ఎలా ఉంటుందో.. అంత అందంగా అలంకరించినట్లుంది.


ఆ చల్లని వాతావరణంలో ఉపాధ్యాయుల పాఠాలు వింటుంటే..... 
పుష్పక విమానం లో గగన ప్రయాణం చేస్తున్నట్లు ఉండేది.
అలా.. రోజులు గడుస్తున్నాయి.... 

అన్నీ ఉన్నా కూడా.. ఏదో తెలియని లోటు...
మనిషి ఇక్కడే ఉన్న....
    మనస్సు ఎక్కడెక్కడికో పరుగులు తీస్తుంది 
    ఆలోచనలు ఆకాశాన్ని తాకుతున్నాయి..
 
అలా నీటి ప్రవాహం లాగ నిలకడగా లేని నా జీవితానికి
ఒక్కసారిగా ఆనకట్ట కట్టినట్లుఅయింది

అప్పటి  వరకు  My life is 
Full of Miracles and Surprises లాగ ఉండేది  
But... అప్పటి నుండి  ("అనుకోకుండా ఆరోజు") 
నా  life Full of Happiness and Emotions ga మారుతుందని  అనుకోలేదు 


                                       అనుకోకుండా ఆ రోజు 
                                         అతి త్వరలో....... 

Sunday, June 21, 2020

నీతొ స్నేహం..... నాకొ వరం 😍


సూర్యస్థమ సమయం లో సాంయంకాలాన మొదలైంది.. నీ స్నేహం
చంద్రోదయం లో తారలు దివి కి కాంతి ఇచ్చినట్లు ...
నా లైఫ్ కి ఆనందాన్ని ఇచ్చింది నీతొ స్నేహం....

సుభోదయం లో సుప్రభాతం లాగ..
చంద్రోదయం లో కలువనవ్వు లాగ..
సూర్యోదయము లో చిలకపలుకుగ మారావు.

డాక్టర్ కి MBBS
ఇంజనీరింగ్ కి B. Tech లాగా
నా గమ్యానికి నువ్వు ఎంతో అవసరం


నీ జాలి ​​ఝుమ్మంది నాదం..
కరుణ కలువ పువ్వు ..
దయ దుంధుభీ  ప్రవాహం లాంటిది.


మారనా నీ కోసం మల్లి పువ్వు లోని పరిమలంగ.....
      ఉండనా ఉప్పొంగె అలలొ నీటి లాగ.....
            చేరనా చిగురాకులోని పచ్చదనం.....


నీతి కథ లో నీతి ఉంటాదో... ఉండదో కానీ.... 
నా ప్రతి కథలోనూ,కదలికలోను.....నువ్వుంటావు

 FOR Loop లాంటి నా లైఫ్ లోకి
      Intitialization లాగ పరిచయం అయ్యవు.
            Assignment/Condition లాగ నా దగ్గరాయవు.
              Increment లాగ మన స్నేహము పెరుగుతుంటుంది.

JNTU లో నెహ్రూ విగ్రహం లాగ
నా మనసులో నీకెప్పుడు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది...

You made my Day Beautiful



Friday, June 19, 2020

కళలో కలవరించిన కవిత్వము.......పేరు పేరున మీతొ పరిచయము

కళాశాల లో గడిపిన అమృత ఘడియలును తలుచుకుంటు.... 
ఆకాంక్షలను సుష్మంగ, సుమం
సన్నివేశాలును,సంఘటనలును సందేశంగ,
కథను,కవిత్వంను కావ్యంగా రాస్తున్నాను...

కుర్దుష్ తో స్నేహం చాల కుశలంగ,కులాశంగ ఉండేది. 

భానుడు అజేయంచైతన్యంతో ప్రకాశిస్తున్న ఉదయం లొ
నరేంద్ర నాటకాలు, 
బొజ్జ గణేష్ బుజ్జగింపులు,
పవన్ పలకరింపులు,
ఉపేంద్ర ఊహలు,
దీపక్ దీవెనలు తేజస్సుగ ఉండేవి. 

క్లాస్ లొ కిషోర్ కితకితలు,
హర్ష అల్లర్లు,
మౌళి మొండితనం ,
ప్రవీణ్ ప్రజంట్ చెప్పడం ,
షాలేమ్ సలహాలు,
మధన్ మంచి మాటలు ,
భరత్ సింహ భరత నాట్యం భలే ఉండేవి.

విక్రమ్ వినయం ప్రవర్తన ,
వెంకట్ వెనుకాల Bench sittings,
సనత్ silly  jokes అందుకు Dream 11 రెడ్డి రౌద్రం ,
మహేష్ మధ్యలో ముచ్చట మాటలు మామూలుగాఉండేవి కాదు.

ప్రసన్నకుమార్ ప్రసంగాలు. 
అందుకు మురళి ముసి ముసి నవ్వులు.. 
శ్రీకాంత్  సర్కారు వారి పాట Style,
లోకేష్ లౌకికత్వం,
చాల Simple గ ఉండేవి.. 

విష్ణు విహార యాత్రలు,
సాకేత్ సంకేతాలు,
మహితోష్ మహిమలు,
క్లాసులో భరద్వాజ్ భాధలు ,
హేమంత్ ఆశ్చర్యం... చాలా హాస్యంగ ఉండేది.

అసలు చెప్పాలంటే.. 
అభిషేక్ అభిమానం
Sasha, Saqlain Style Super గ ఉండేవి... 

ఇల్లాలు ఇంటికి 
అమ్మాయిలు తరగతి కి అందం,ఆనందం.

పవిత్రమైన శ్రావణీ శుక్రవారం నాడు 
తరగతంత తారలుగ తల తల మెరుస్తుండంగ, 
అపర్ణంగ, అపూర్వంగ మైతిలీ భావం తో చేతనంస్నేహా భావంతో మెలుగుతున్న దృశ్యం చూసాక నా మనస్సు మబ్బులాగ కరిగింది.

సుమియ, శిరీష Silent Sitting లు,
సుధ, సలోమి Serious Studying లు ,
మౌనిక భావనలను లలిత కళ లో ఒకటైన చిత్ర లేఖనంలొ భద్ర పరిచే మౌళిక విధానం చాల మంచిగ ఉండేది.

మా ఆలోచనలు ప్రాచీనంగ కాకుండా, 
నవీనంగ, విఘ్ణతంగ ఉండేవి.

కళాశాల భోజనం తింటుంటే
నకులసహదేవుల చేతి వంట రమ్యంగ,రమణీయంగ ఉంటుందని  తెలిసి ఆ భోజనం ను   ఇంద్రడు మతి పోయేల తిన్న సందర్భం
కమలం కోమలంగ మారిన వేల గుర్తుచ్చేది. 

మహేశ్వరి క్లాస్ మధ్యలో ప్రయాణాలు 
దీపిక దైర్యం 
తనూష తీపిపలుకులు 
రమ్య రుచికరమైన మాటలు
రంగుల రాట్నం లాగ ఉండేవి.

Program లొ code లాగ కలసి ఉందాం 
Compile time లో విడిపోయిన 
Final Result లో code అంతా కలసి ఉంటుంది కదా... 


చదువుల లో సరస్వతి దేవి..
అందరూ బాగుండాలని అల్ల ఆశీస్సులు..
జాలీగ, జల్సాగ జీవించాలని Jesus తోడు..
సకల కోట్ల దేవతల దీవెనలు మనకెప్పుడు ఉంటాయి... 
ముఖ్యంగా ఏడుకొండలు స్వామి Blessings మనకి యుహితంగ ఉండాలని కోరుకుంటున్నాను...

కళాశాల లో ఉన్నంతకాలం ఇంటికి వెళ్లాలని ఎదురు చూస్తుంటాము...
ఇంటికి చేరాక తిరిగి కళాశాల కి రావాలని కలవర పడుతుంటాము..
స్థలం నుండి మనుషులు విడిపోవచ్చు కానీ 
మనస్సులు విడిపోవు 

One should knew the value of Thing / Person when it is Far away from Him 
ఏదైన మన నుండి దూరం కాకముందే దాని విలువ తెలుసుకోవాలి.

Tuesday, June 16, 2020

కళలును కనువిందు చేసిన కళాశాల......APRJC గ్యారంపల్లి

పదవ తరగతి తరువాత చెరువులోనుండి బయట పడ్డ చేప లాగున్న నా జీవితం ఒక్క సారిగా నదిలో పడ్డట్లైంది.

కొండల నడుమ
    వృక్షాల వంపున
               పొలాల పక్కన ఉన్న  ఆ కళాశాలకు చేరుకున్నాను..

కొండంత ఆశ ... .ఎన్నెన్నో ఊహలతో వచ్చాము..  కానీ  ఆశ నిరాశగా మారింది...
అయితెనేం... ఉన్నదాంట్లో సర్దుకుపోవలనుకున్న...

అక్కడ...
పచ్చని చెట్లున్న ప్రకృతి  నన్ను పలకరించింది.
అందమైన ఆ పర్యావరణ ఆకృతి నన్ను ఆహ్వానించింది..

వచ్చిన కొద్ది రోజులకే పరిచయాలు పర్వతాలను...
     స్నేహాలు శిఖరాలను అధిరోహించాయి.

కొత్త తరగతులు
కొన్ని నిబంధనలు
కొంతమంది ఉపాధ్యాయుల ఉపన్యాసములు
నన్నిప్పటికీ కలవర పరుస్తున్నాయి..

ప్రతి కాలేజ్ కి ఒక ప్రత్యెకత ఉంటుంది .. మాకూడ ఒకటుంది.....ప్రియమైన భోజనం.
రమణ చేతి వంట రామణీయంగా ఉంటుండి...
ఇక్కడికి వచ్చాక  బుర్ర లో జ్ఞానం పెరుగుతుందో లేదో కానీ......
Body లో బరువు కచ్చితంగా పెరుగుతుంది...

చెట్లకింద సంస్కృతి Sir సూక్తులు.
 శివయ్య Sir సూత్రాలు..
  శివమూర్తి Sir సలహాలు..
   శంకర్ Sir శాపాలు..
     ప్రిన్సిపాల్ Sir ప్రస్తావనలు..
      అన్నపూర్ణ Madam అనురాగం..
          మధన్ Sir మమకారాలు..
                      మదిలో మెలుగుతున్నాయి.....
అందులో మునిరాజన్న ముక్కుసూటి మాటలు  ఒకటి.....
భగీరథుడు ఎలా ఉంటాడో తెలియదు....కానీ మాకు తెలిసిన భగీరథుడు గంగులన్న.
సుభోధయం లో సుప్రభాతంగ PD Sir విసిల్ వినపడేది ...
చేసిన వ్యాయామాలు....విన్న ఉపదేశాలు ఎప్పటికీ గుర్తుంటాయి..

ఆదివారం చపాతీల కోసం గొడవలు..
మైదానంలో ల మోహమాటాలు
Study ours లో  sleeping.... 
Late night and Shift Studying లు
దొంగ గా Mobile లు వాడటం.. 
అబ్బబబ.. ఇలా చెప్పుకోవడానికి చాల ఉన్నాయిలే...

హాస్టల్ లో అల్లరికి ఇంక హద్దులు లేవ్ అనుకో....
నూతన సంవత్సర సంబరాలు చాల సంతోషంను ఇచ్చేవి.. 


రాత్రి వేల  స్నేహితుల తో Dabha కి వెళ్లడం..
మెస్ లో దొంగతనలు
ఆదివారం నాడు పీలేరు ప్రయాణాలు
ఆటలు ... పాటలు .. అల్లర్లు ...... చిలిపి పనులు
తలుచుకుంటె ఆనందని ఇస్తై ..
కానీ.... కావలనుకుంటే మళ్ళీ రావు...

చివరికి పరిక్షలు రానే వచ్చాయి ....
అస్సల చెప్పాలంటే చెట్లకు వేర్లు...
Building కు స్తంభాలున్నట్లూ 
గ్యారంపల్లి కి కలకడ ఉంది. 
ఒక్కసారిగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు మోత మొగింది.
ఆ విజయం వెనుక మా కృషి,పట్టుదల ఎంతోఉంది...... 

ప్రపంచం అంటే ఏంటో  పరిచయము అయింది ఇక్కడే...

అలా రెండు సంవత్సరాలు గడిచాయి..
ఎన్నో తీపి జ్ఞాపకాలు మిగిలాయి.
చెప్పలంటే .... చాలా ఉన్నై ..

నా లోని భావాలను. ...
            భావనలను...
               ఈ.. చిన్న ఉపన్యాసము గా రాశాను... 


నాకే కానీ  దేవుడు వరం ఇస్తే ...
కళాశాల రోజులు మళ్లీ కోరుకుంట...

వచ్చాయి వానలు.💧☔💧 ....గుర్తొచ్చాయి నాలోని జ్ఞాపకాలు😍😍

వచ్చాయి ఋతుపవనాలు .... తెచ్చాయి ప్రకృతికి అందాలు...... బురదలో అడుగులు   బూడిదలో నీటి చుక్కలు   ఆకాశంలో మెరుపులు   నేలపై నీటి గుంటలు   కొండ చ...