Tuesday, June 16, 2020

కళలును కనువిందు చేసిన కళాశాల......APRJC గ్యారంపల్లి

పదవ తరగతి తరువాత చెరువులోనుండి బయట పడ్డ చేప లాగున్న నా జీవితం ఒక్క సారిగా నదిలో పడ్డట్లైంది.

కొండల నడుమ
    వృక్షాల వంపున
               పొలాల పక్కన ఉన్న  ఆ కళాశాలకు చేరుకున్నాను..

కొండంత ఆశ ... .ఎన్నెన్నో ఊహలతో వచ్చాము..  కానీ  ఆశ నిరాశగా మారింది...
అయితెనేం... ఉన్నదాంట్లో సర్దుకుపోవలనుకున్న...

అక్కడ...
పచ్చని చెట్లున్న ప్రకృతి  నన్ను పలకరించింది.
అందమైన ఆ పర్యావరణ ఆకృతి నన్ను ఆహ్వానించింది..

వచ్చిన కొద్ది రోజులకే పరిచయాలు పర్వతాలను...
     స్నేహాలు శిఖరాలను అధిరోహించాయి.

కొత్త తరగతులు
కొన్ని నిబంధనలు
కొంతమంది ఉపాధ్యాయుల ఉపన్యాసములు
నన్నిప్పటికీ కలవర పరుస్తున్నాయి..

ప్రతి కాలేజ్ కి ఒక ప్రత్యెకత ఉంటుంది .. మాకూడ ఒకటుంది.....ప్రియమైన భోజనం.
రమణ చేతి వంట రామణీయంగా ఉంటుండి...
ఇక్కడికి వచ్చాక  బుర్ర లో జ్ఞానం పెరుగుతుందో లేదో కానీ......
Body లో బరువు కచ్చితంగా పెరుగుతుంది...

చెట్లకింద సంస్కృతి Sir సూక్తులు.
 శివయ్య Sir సూత్రాలు..
  శివమూర్తి Sir సలహాలు..
   శంకర్ Sir శాపాలు..
     ప్రిన్సిపాల్ Sir ప్రస్తావనలు..
      అన్నపూర్ణ Madam అనురాగం..
          మధన్ Sir మమకారాలు..
                      మదిలో మెలుగుతున్నాయి.....
అందులో మునిరాజన్న ముక్కుసూటి మాటలు  ఒకటి.....
భగీరథుడు ఎలా ఉంటాడో తెలియదు....కానీ మాకు తెలిసిన భగీరథుడు గంగులన్న.
సుభోధయం లో సుప్రభాతంగ PD Sir విసిల్ వినపడేది ...
చేసిన వ్యాయామాలు....విన్న ఉపదేశాలు ఎప్పటికీ గుర్తుంటాయి..

ఆదివారం చపాతీల కోసం గొడవలు..
మైదానంలో ల మోహమాటాలు
Study ours లో  sleeping.... 
Late night and Shift Studying లు
దొంగ గా Mobile లు వాడటం.. 
అబ్బబబ.. ఇలా చెప్పుకోవడానికి చాల ఉన్నాయిలే...

హాస్టల్ లో అల్లరికి ఇంక హద్దులు లేవ్ అనుకో....
నూతన సంవత్సర సంబరాలు చాల సంతోషంను ఇచ్చేవి.. 


రాత్రి వేల  స్నేహితుల తో Dabha కి వెళ్లడం..
మెస్ లో దొంగతనలు
ఆదివారం నాడు పీలేరు ప్రయాణాలు
ఆటలు ... పాటలు .. అల్లర్లు ...... చిలిపి పనులు
తలుచుకుంటె ఆనందని ఇస్తై ..
కానీ.... కావలనుకుంటే మళ్ళీ రావు...

చివరికి పరిక్షలు రానే వచ్చాయి ....
అస్సల చెప్పాలంటే చెట్లకు వేర్లు...
Building కు స్తంభాలున్నట్లూ 
గ్యారంపల్లి కి కలకడ ఉంది. 
ఒక్కసారిగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు మోత మొగింది.
ఆ విజయం వెనుక మా కృషి,పట్టుదల ఎంతోఉంది...... 

ప్రపంచం అంటే ఏంటో  పరిచయము అయింది ఇక్కడే...

అలా రెండు సంవత్సరాలు గడిచాయి..
ఎన్నో తీపి జ్ఞాపకాలు మిగిలాయి.
చెప్పలంటే .... చాలా ఉన్నై ..

నా లోని భావాలను. ...
            భావనలను...
               ఈ.. చిన్న ఉపన్యాసము గా రాశాను... 


నాకే కానీ  దేవుడు వరం ఇస్తే ...
కళాశాల రోజులు మళ్లీ కోరుకుంట...

7 comments:

వచ్చాయి వానలు.💧☔💧 ....గుర్తొచ్చాయి నాలోని జ్ఞాపకాలు😍😍

వచ్చాయి ఋతుపవనాలు .... తెచ్చాయి ప్రకృతికి అందాలు...... బురదలో అడుగులు   బూడిదలో నీటి చుక్కలు   ఆకాశంలో మెరుపులు   నేలపై నీటి గుంటలు   కొండ చ...