Monday, June 8, 2020

నాకు కూడా ఓ కథ ఉంది ... అందులో ప్రేమ ఉంది కాని ప్రేయసి లేదు

ఏమని చెప్పను
ఎంతని చెప్పను
మరవలేనివి ఆ రోజులు
మరుపురానివి ఆ జ్ఞాపకలు

రాయలసీమ లో రతనాల సీమలో..
రాజులు ఏలిన అ రంగుల సీమ లో....
రామాయణం రాసిన కవి ని కనువిందు చేసిన ఆ వాల్మికీపురం గ్రామం లో ...
పరిచయం అయింది ఆ PVC పాఠశాలలో ...

తరగతి మారే తరుణం లో మొదలైంది  .. ఇ ప్రేమ
పదోతరగతి లో పరవల్లు తొక్కింది .. నా ప్రేమ

కొత్త ఉపాధ్యాయులు కొన్ని ఉపదేశాలు
ఎన్నో పరిచయాలు ... అందులో అద్భుతమైనది నా జీవితం లోకీ నీ ప్రవేశం

మాట్లాడనె నీ నోటిలోని పక్షుల గానాలు
మెదలించనె నీ మనసులోని మౌనరాగలు

వజ్రం తో వర్ణించనా... నీ అందం
అందులోని పరావర్తనం అని చెప్పన నీ ప్రతిబింబం

మత్త్యేబం  లాంటి నీ మొఖం లో ..
చంపకమాల లాంటి చిరునవ్వు చూశాను.
శార్దూలం లాంటి ఆ సిగ్గు చూసి ..
ఉత్పలమాల లా ఉప్పొంగిపోయాను



సప్త స్వరాలలో దాగున్నా ఓ సాహిత్యమా .....
 వినిపించ లేదా..... 
                  నా స్వరతంతు లోని నీ స్వరం
 కనిపించ   లేదా....
                 నా నేత్రం లోనీ ప్రతిబింబం


నువ్వు మొదటిసారి నన్ను చూసినప్పుడు నీచూపు లోని బాణాలు 
              కుచ్ఛుకున్నాయి నా నరాల్లో ...
నీ నోటి మాటల్లోన్ని తూటాలు
                                        దూసుకెల్లాయు నా ప్రేమా పాఠాల్లో... 


నీ నవ్వుల అలలలో మునిగాను....
నీ చూపుల సంద్రం లో తేలాను...
నీ ప్రేమ తీరం లో నను చేర్చవా...?


నిండు పున్నమి నాడు
     పండు వెన్నెలలో
              తలచాను నిను నేను
                        మయమరిచాను నను నేను


భావాలను భౌతికశాస్త్రం లో ..
సహజత్వానీ సాంఘికశాస్త్రం లో ...
ఆనందాన్ని ఆంగ్లం లో ..
దాచుకొని ...
తేలుగువాచకం అనే తెర తీసుకోని
చిరునవ్వు తో నీ చెంతకు చేరాను
కాని ......
కాలం కన్ను ఎర్ర చేసింది ...


నీకోసం రామాయణము లో కాండలు గా.. 
మహాభారతము లో పర్వాలు గా.....
గణితం లో లెక్కలు గా....
తెలుగు లో వ్యాకరణం గా.......
సోషల్ లో హిస్టరీ గ ఉందాం అనుకున్నా....

నా కథలో కథానాయికవి అనుకున్నా ...
కాని ఈ కథే నీది కాదని నన్ను కన్నీటి కడలిలో తోసేసావ్😕

పదవ తరగతి పరిక్షలు పరుగులు తీస్తున్నాయి
కాని నా ప్రేమ ఎక్కడ వేసినా గొంగళి అక్కడే ఉన్నట్లుండి ..

దేవత లేని నా హృదయం లోకి వచ్చి
శిల్పం లాగా ఉన్న నాకు ప్రాణం పోస్తావని ...

వెయ్యి కన్నులతొ.....
కోటి ఆశలతో వేచిచూస్తుంటా ......



నీతో ఉన్న క్షణాలు మధుర క్షణాలై ....
లేని క్షణాలు తీపి జ్ఞాపకాలై ..
ఎప్పటికీ గుర్తు పెట్టుకొంటా......


అలా గడిచింది కాలం....
    ముగిసింది నా ప్రేమ ప్రయాణం ....


నవ్వు తో మొదలై...
చూపులతో కొనసాగి....
జ్ఞాపకాలు లాగ మిగిలిపోయింది ... నా ప్రేమ 



అప్పటి  వరకు  My life is 
Full of Miracles and Surprises లాగ ఉండేది  
But... అప్పటి నుండి  ("అనుకోకుండా ఆరోజు") 
నా  life Full of Happiness and Emotions ga మారుతుందని  అనుకోలేదు 



                                   అనుకోకుండా ఆరోజు
                                  (Inter and B.Tech life ) 
                                  అతి త్వరలో........... 

29 comments:

  1. Nee lo kavini nidhra lepi rasina
    Ee chilaka palukula vanti vakyalu chala bagunnayi
    Chala baga rasavu

    ReplyDelete
  2. Impressive raja... keep it up

    ReplyDelete
  3. Omg... Kondaaa ..... Heart touching poet....

    This line 👇

    "నా కథలో కథానాయికవి అనుకున్నా ..."

    I just love it♥️.

    ReplyDelete
  4. there are lot of telugu spelling mistakes babai.you must take care of them..:)

    ReplyDelete
  5. Chala pulakaristundii nee premakavithvam🥰🥰

    ReplyDelete
  6. Keep it up nana nee kavithalu inka ravalani korukontunna...

    ReplyDelete
  7. Vere level kooooooooo🥳🥳

    ReplyDelete

వచ్చాయి వానలు.💧☔💧 ....గుర్తొచ్చాయి నాలోని జ్ఞాపకాలు😍😍

వచ్చాయి ఋతుపవనాలు .... తెచ్చాయి ప్రకృతికి అందాలు...... బురదలో అడుగులు   బూడిదలో నీటి చుక్కలు   ఆకాశంలో మెరుపులు   నేలపై నీటి గుంటలు   కొండ చ...