Thursday, June 25, 2020

అనగనగా JNTU కళాశాల లో....... పుణ్యమైన పులివెందుల లో

పులివెందుల లొ పులి ఉందో లేదో కాని...
ఆ JNTU కళాశాలకి ఒక మంచి కళ ఉంది..

ఆ కళాశాల చూశాక .. ఒక్కసారిగా నా తనువు పులకరించింది..
పంజరం లో ఉన్న చిలకను అడవిలో వదిలినట్లైంది.

వర్షపు నీటికి మట్టిలోనుండి వచ్చే సువాసన
కొత్తవారిని పరిచయం చేసుకున్నాక వచ్చే ఆనందం .... చాలా ఆహ్లాదకరంగ ఉండింది.. 

ఒక సాయంత్రం అలా మైదానంలో వెళుతుండగా..... 
రోజంతా విశ్వానికి వెలుగు ఇచ్చిన భానుడు ఇంటికి పరుగులు తీస్తున్నాడు.
ఆకాశంలో మేఘాలు ఒకదాన్ని ఒకటి తరుముకుంటున్నాయి.  
చెట్లు నుండి వచ్చే గాలి..
           చిన్నారుల చిరునవ్వు అంత స్వచ్ఛంగా ఉండేది. .   

రాత్రి వేళ లో... దివి అంతా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి,తారలు ఆ మేఘాల మధ్య దాగుడుమూతలు ఆడుతున్నాయి...
చంద్రుడు ని మబ్బులు చుట్టుముట్టేశాయి... 

ఒక్కసారిగ జీమూతం కరిగి పుడమి కి చేసుకున్నాయి... 
ధరణి దాహం తీర్చుకుంది....
చుట్టూ అంధకారం చుట్టేసింది..
తిమిరంలొ చలిచలము, వాగువంక, అంభుధి ఆనందంతో పొంగిపోయాయి...

రాత్రంత నిద్రిస్తున్న రవి తిరిగిరానేవచ్చాడు. 
సూర్యరశ్మి  అవనికి చేరుతున్న సందర్భంలొ..
వృక్షాలలోని పచ్చని పత్రాలు పులకరించాయి. 

ఉదయం పూట చెట్లులో పక్షుల రాగాలు, కోయల గానాలు , శ్రీ కృష్ణడి పిల్లనగ్రోవి వలే మోగుతుండేవి..

స్నేహితుల ఆటలపాటలతో వసతి గృహం నుండి తరగతి గదికి చకచకా చేరుకున్నాము.

సీనియర్స్ చేసే ర్యాగింగ్...
  కళాశాల క్యాంపస్ ని అలంకరించి నట్లూ చేసేది

ఆ తరగతి గదిలో....
నాలుగు దిక్కులున్న ప్రపంచ్చాన్ని..
నాలుగు గోడల మద్య ఉంచినట్లుండేది.

తరగతి గదిలో పడుకుంటె ...
గగన వీధుల్లో మహా విష్ణువు పానుపు పైన పడుకున్నట్లుందేది...

ఆడపడుచులను హరివిల్లులోని అందాలతొ పోల్చడానికి నాకు అతిశయోక్తి సరిపోలేదు.
ప్రపంచంలో ఉన్న రంగులన్నీ... ఒక చోటికి చేర్చితె ఎలా ఉంటుందో.. అంత అందంగా అలంకరించినట్లుంది.


ఆ చల్లని వాతావరణంలో ఉపాధ్యాయుల పాఠాలు వింటుంటే..... 
పుష్పక విమానం లో గగన ప్రయాణం చేస్తున్నట్లు ఉండేది.
అలా.. రోజులు గడుస్తున్నాయి.... 

అన్నీ ఉన్నా కూడా.. ఏదో తెలియని లోటు...
మనిషి ఇక్కడే ఉన్న....
    మనస్సు ఎక్కడెక్కడికో పరుగులు తీస్తుంది 
    ఆలోచనలు ఆకాశాన్ని తాకుతున్నాయి..
 
అలా నీటి ప్రవాహం లాగ నిలకడగా లేని నా జీవితానికి
ఒక్కసారిగా ఆనకట్ట కట్టినట్లుఅయింది

అప్పటి  వరకు  My life is 
Full of Miracles and Surprises లాగ ఉండేది  
But... అప్పటి నుండి  ("అనుకోకుండా ఆరోజు") 
నా  life Full of Happiness and Emotions ga మారుతుందని  అనుకోలేదు 


                                       అనుకోకుండా ఆ రోజు 
                                         అతి త్వరలో....... 

Sunday, June 21, 2020

నీతొ స్నేహం..... నాకొ వరం 😍


సూర్యస్థమ సమయం లో సాంయంకాలాన మొదలైంది.. నీ స్నేహం
చంద్రోదయం లో తారలు దివి కి కాంతి ఇచ్చినట్లు ...
నా లైఫ్ కి ఆనందాన్ని ఇచ్చింది నీతొ స్నేహం....

సుభోదయం లో సుప్రభాతం లాగ..
చంద్రోదయం లో కలువనవ్వు లాగ..
సూర్యోదయము లో చిలకపలుకుగ మారావు.

డాక్టర్ కి MBBS
ఇంజనీరింగ్ కి B. Tech లాగా
నా గమ్యానికి నువ్వు ఎంతో అవసరం


నీ జాలి ​​ఝుమ్మంది నాదం..
కరుణ కలువ పువ్వు ..
దయ దుంధుభీ  ప్రవాహం లాంటిది.


మారనా నీ కోసం మల్లి పువ్వు లోని పరిమలంగ.....
      ఉండనా ఉప్పొంగె అలలొ నీటి లాగ.....
            చేరనా చిగురాకులోని పచ్చదనం.....


నీతి కథ లో నీతి ఉంటాదో... ఉండదో కానీ.... 
నా ప్రతి కథలోనూ,కదలికలోను.....నువ్వుంటావు

 FOR Loop లాంటి నా లైఫ్ లోకి
      Intitialization లాగ పరిచయం అయ్యవు.
            Assignment/Condition లాగ నా దగ్గరాయవు.
              Increment లాగ మన స్నేహము పెరుగుతుంటుంది.

JNTU లో నెహ్రూ విగ్రహం లాగ
నా మనసులో నీకెప్పుడు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది...

You made my Day Beautiful



Friday, June 19, 2020

కళలో కలవరించిన కవిత్వము.......పేరు పేరున మీతొ పరిచయము

కళాశాల లో గడిపిన అమృత ఘడియలును తలుచుకుంటు.... 
ఆకాంక్షలను సుష్మంగ, సుమం
సన్నివేశాలును,సంఘటనలును సందేశంగ,
కథను,కవిత్వంను కావ్యంగా రాస్తున్నాను...

కుర్దుష్ తో స్నేహం చాల కుశలంగ,కులాశంగ ఉండేది. 

భానుడు అజేయంచైతన్యంతో ప్రకాశిస్తున్న ఉదయం లొ
నరేంద్ర నాటకాలు, 
బొజ్జ గణేష్ బుజ్జగింపులు,
పవన్ పలకరింపులు,
ఉపేంద్ర ఊహలు,
దీపక్ దీవెనలు తేజస్సుగ ఉండేవి. 

క్లాస్ లొ కిషోర్ కితకితలు,
హర్ష అల్లర్లు,
మౌళి మొండితనం ,
ప్రవీణ్ ప్రజంట్ చెప్పడం ,
షాలేమ్ సలహాలు,
మధన్ మంచి మాటలు ,
భరత్ సింహ భరత నాట్యం భలే ఉండేవి.

విక్రమ్ వినయం ప్రవర్తన ,
వెంకట్ వెనుకాల Bench sittings,
సనత్ silly  jokes అందుకు Dream 11 రెడ్డి రౌద్రం ,
మహేష్ మధ్యలో ముచ్చట మాటలు మామూలుగాఉండేవి కాదు.

ప్రసన్నకుమార్ ప్రసంగాలు. 
అందుకు మురళి ముసి ముసి నవ్వులు.. 
శ్రీకాంత్  సర్కారు వారి పాట Style,
లోకేష్ లౌకికత్వం,
చాల Simple గ ఉండేవి.. 

విష్ణు విహార యాత్రలు,
సాకేత్ సంకేతాలు,
మహితోష్ మహిమలు,
క్లాసులో భరద్వాజ్ భాధలు ,
హేమంత్ ఆశ్చర్యం... చాలా హాస్యంగ ఉండేది.

అసలు చెప్పాలంటే.. 
అభిషేక్ అభిమానం
Sasha, Saqlain Style Super గ ఉండేవి... 

ఇల్లాలు ఇంటికి 
అమ్మాయిలు తరగతి కి అందం,ఆనందం.

పవిత్రమైన శ్రావణీ శుక్రవారం నాడు 
తరగతంత తారలుగ తల తల మెరుస్తుండంగ, 
అపర్ణంగ, అపూర్వంగ మైతిలీ భావం తో చేతనంస్నేహా భావంతో మెలుగుతున్న దృశ్యం చూసాక నా మనస్సు మబ్బులాగ కరిగింది.

సుమియ, శిరీష Silent Sitting లు,
సుధ, సలోమి Serious Studying లు ,
మౌనిక భావనలను లలిత కళ లో ఒకటైన చిత్ర లేఖనంలొ భద్ర పరిచే మౌళిక విధానం చాల మంచిగ ఉండేది.

మా ఆలోచనలు ప్రాచీనంగ కాకుండా, 
నవీనంగ, విఘ్ణతంగ ఉండేవి.

కళాశాల భోజనం తింటుంటే
నకులసహదేవుల చేతి వంట రమ్యంగ,రమణీయంగ ఉంటుందని  తెలిసి ఆ భోజనం ను   ఇంద్రడు మతి పోయేల తిన్న సందర్భం
కమలం కోమలంగ మారిన వేల గుర్తుచ్చేది. 

మహేశ్వరి క్లాస్ మధ్యలో ప్రయాణాలు 
దీపిక దైర్యం 
తనూష తీపిపలుకులు 
రమ్య రుచికరమైన మాటలు
రంగుల రాట్నం లాగ ఉండేవి.

Program లొ code లాగ కలసి ఉందాం 
Compile time లో విడిపోయిన 
Final Result లో code అంతా కలసి ఉంటుంది కదా... 


చదువుల లో సరస్వతి దేవి..
అందరూ బాగుండాలని అల్ల ఆశీస్సులు..
జాలీగ, జల్సాగ జీవించాలని Jesus తోడు..
సకల కోట్ల దేవతల దీవెనలు మనకెప్పుడు ఉంటాయి... 
ముఖ్యంగా ఏడుకొండలు స్వామి Blessings మనకి యుహితంగ ఉండాలని కోరుకుంటున్నాను...

కళాశాల లో ఉన్నంతకాలం ఇంటికి వెళ్లాలని ఎదురు చూస్తుంటాము...
ఇంటికి చేరాక తిరిగి కళాశాల కి రావాలని కలవర పడుతుంటాము..
స్థలం నుండి మనుషులు విడిపోవచ్చు కానీ 
మనస్సులు విడిపోవు 

One should knew the value of Thing / Person when it is Far away from Him 
ఏదైన మన నుండి దూరం కాకముందే దాని విలువ తెలుసుకోవాలి.

Tuesday, June 16, 2020

కళలును కనువిందు చేసిన కళాశాల......APRJC గ్యారంపల్లి

పదవ తరగతి తరువాత చెరువులోనుండి బయట పడ్డ చేప లాగున్న నా జీవితం ఒక్క సారిగా నదిలో పడ్డట్లైంది.

కొండల నడుమ
    వృక్షాల వంపున
               పొలాల పక్కన ఉన్న  ఆ కళాశాలకు చేరుకున్నాను..

కొండంత ఆశ ... .ఎన్నెన్నో ఊహలతో వచ్చాము..  కానీ  ఆశ నిరాశగా మారింది...
అయితెనేం... ఉన్నదాంట్లో సర్దుకుపోవలనుకున్న...

అక్కడ...
పచ్చని చెట్లున్న ప్రకృతి  నన్ను పలకరించింది.
అందమైన ఆ పర్యావరణ ఆకృతి నన్ను ఆహ్వానించింది..

వచ్చిన కొద్ది రోజులకే పరిచయాలు పర్వతాలను...
     స్నేహాలు శిఖరాలను అధిరోహించాయి.

కొత్త తరగతులు
కొన్ని నిబంధనలు
కొంతమంది ఉపాధ్యాయుల ఉపన్యాసములు
నన్నిప్పటికీ కలవర పరుస్తున్నాయి..

ప్రతి కాలేజ్ కి ఒక ప్రత్యెకత ఉంటుంది .. మాకూడ ఒకటుంది.....ప్రియమైన భోజనం.
రమణ చేతి వంట రామణీయంగా ఉంటుండి...
ఇక్కడికి వచ్చాక  బుర్ర లో జ్ఞానం పెరుగుతుందో లేదో కానీ......
Body లో బరువు కచ్చితంగా పెరుగుతుంది...

చెట్లకింద సంస్కృతి Sir సూక్తులు.
 శివయ్య Sir సూత్రాలు..
  శివమూర్తి Sir సలహాలు..
   శంకర్ Sir శాపాలు..
     ప్రిన్సిపాల్ Sir ప్రస్తావనలు..
      అన్నపూర్ణ Madam అనురాగం..
          మధన్ Sir మమకారాలు..
                      మదిలో మెలుగుతున్నాయి.....
అందులో మునిరాజన్న ముక్కుసూటి మాటలు  ఒకటి.....
భగీరథుడు ఎలా ఉంటాడో తెలియదు....కానీ మాకు తెలిసిన భగీరథుడు గంగులన్న.
సుభోధయం లో సుప్రభాతంగ PD Sir విసిల్ వినపడేది ...
చేసిన వ్యాయామాలు....విన్న ఉపదేశాలు ఎప్పటికీ గుర్తుంటాయి..

ఆదివారం చపాతీల కోసం గొడవలు..
మైదానంలో ల మోహమాటాలు
Study ours లో  sleeping.... 
Late night and Shift Studying లు
దొంగ గా Mobile లు వాడటం.. 
అబ్బబబ.. ఇలా చెప్పుకోవడానికి చాల ఉన్నాయిలే...

హాస్టల్ లో అల్లరికి ఇంక హద్దులు లేవ్ అనుకో....
నూతన సంవత్సర సంబరాలు చాల సంతోషంను ఇచ్చేవి.. 


రాత్రి వేల  స్నేహితుల తో Dabha కి వెళ్లడం..
మెస్ లో దొంగతనలు
ఆదివారం నాడు పీలేరు ప్రయాణాలు
ఆటలు ... పాటలు .. అల్లర్లు ...... చిలిపి పనులు
తలుచుకుంటె ఆనందని ఇస్తై ..
కానీ.... కావలనుకుంటే మళ్ళీ రావు...

చివరికి పరిక్షలు రానే వచ్చాయి ....
అస్సల చెప్పాలంటే చెట్లకు వేర్లు...
Building కు స్తంభాలున్నట్లూ 
గ్యారంపల్లి కి కలకడ ఉంది. 
ఒక్కసారిగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు మోత మొగింది.
ఆ విజయం వెనుక మా కృషి,పట్టుదల ఎంతోఉంది...... 

ప్రపంచం అంటే ఏంటో  పరిచయము అయింది ఇక్కడే...

అలా రెండు సంవత్సరాలు గడిచాయి..
ఎన్నో తీపి జ్ఞాపకాలు మిగిలాయి.
చెప్పలంటే .... చాలా ఉన్నై ..

నా లోని భావాలను. ...
            భావనలను...
               ఈ.. చిన్న ఉపన్యాసము గా రాశాను... 


నాకే కానీ  దేవుడు వరం ఇస్తే ...
కళాశాల రోజులు మళ్లీ కోరుకుంట...

Monday, June 8, 2020

నాకు కూడా ఓ కథ ఉంది ... అందులో ప్రేమ ఉంది కాని ప్రేయసి లేదు

ఏమని చెప్పను
ఎంతని చెప్పను
మరవలేనివి ఆ రోజులు
మరుపురానివి ఆ జ్ఞాపకలు

రాయలసీమ లో రతనాల సీమలో..
రాజులు ఏలిన అ రంగుల సీమ లో....
రామాయణం రాసిన కవి ని కనువిందు చేసిన ఆ వాల్మికీపురం గ్రామం లో ...
పరిచయం అయింది ఆ PVC పాఠశాలలో ...

తరగతి మారే తరుణం లో మొదలైంది  .. ఇ ప్రేమ
పదోతరగతి లో పరవల్లు తొక్కింది .. నా ప్రేమ

కొత్త ఉపాధ్యాయులు కొన్ని ఉపదేశాలు
ఎన్నో పరిచయాలు ... అందులో అద్భుతమైనది నా జీవితం లోకీ నీ ప్రవేశం

మాట్లాడనె నీ నోటిలోని పక్షుల గానాలు
మెదలించనె నీ మనసులోని మౌనరాగలు

వజ్రం తో వర్ణించనా... నీ అందం
అందులోని పరావర్తనం అని చెప్పన నీ ప్రతిబింబం

మత్త్యేబం  లాంటి నీ మొఖం లో ..
చంపకమాల లాంటి చిరునవ్వు చూశాను.
శార్దూలం లాంటి ఆ సిగ్గు చూసి ..
ఉత్పలమాల లా ఉప్పొంగిపోయాను



సప్త స్వరాలలో దాగున్నా ఓ సాహిత్యమా .....
 వినిపించ లేదా..... 
                  నా స్వరతంతు లోని నీ స్వరం
 కనిపించ   లేదా....
                 నా నేత్రం లోనీ ప్రతిబింబం


నువ్వు మొదటిసారి నన్ను చూసినప్పుడు నీచూపు లోని బాణాలు 
              కుచ్ఛుకున్నాయి నా నరాల్లో ...
నీ నోటి మాటల్లోన్ని తూటాలు
                                        దూసుకెల్లాయు నా ప్రేమా పాఠాల్లో... 


నీ నవ్వుల అలలలో మునిగాను....
నీ చూపుల సంద్రం లో తేలాను...
నీ ప్రేమ తీరం లో నను చేర్చవా...?


నిండు పున్నమి నాడు
     పండు వెన్నెలలో
              తలచాను నిను నేను
                        మయమరిచాను నను నేను


భావాలను భౌతికశాస్త్రం లో ..
సహజత్వానీ సాంఘికశాస్త్రం లో ...
ఆనందాన్ని ఆంగ్లం లో ..
దాచుకొని ...
తేలుగువాచకం అనే తెర తీసుకోని
చిరునవ్వు తో నీ చెంతకు చేరాను
కాని ......
కాలం కన్ను ఎర్ర చేసింది ...


నీకోసం రామాయణము లో కాండలు గా.. 
మహాభారతము లో పర్వాలు గా.....
గణితం లో లెక్కలు గా....
తెలుగు లో వ్యాకరణం గా.......
సోషల్ లో హిస్టరీ గ ఉందాం అనుకున్నా....

నా కథలో కథానాయికవి అనుకున్నా ...
కాని ఈ కథే నీది కాదని నన్ను కన్నీటి కడలిలో తోసేసావ్😕

పదవ తరగతి పరిక్షలు పరుగులు తీస్తున్నాయి
కాని నా ప్రేమ ఎక్కడ వేసినా గొంగళి అక్కడే ఉన్నట్లుండి ..

దేవత లేని నా హృదయం లోకి వచ్చి
శిల్పం లాగా ఉన్న నాకు ప్రాణం పోస్తావని ...

వెయ్యి కన్నులతొ.....
కోటి ఆశలతో వేచిచూస్తుంటా ......



నీతో ఉన్న క్షణాలు మధుర క్షణాలై ....
లేని క్షణాలు తీపి జ్ఞాపకాలై ..
ఎప్పటికీ గుర్తు పెట్టుకొంటా......


అలా గడిచింది కాలం....
    ముగిసింది నా ప్రేమ ప్రయాణం ....


నవ్వు తో మొదలై...
చూపులతో కొనసాగి....
జ్ఞాపకాలు లాగ మిగిలిపోయింది ... నా ప్రేమ 



అప్పటి  వరకు  My life is 
Full of Miracles and Surprises లాగ ఉండేది  
But... అప్పటి నుండి  ("అనుకోకుండా ఆరోజు") 
నా  life Full of Happiness and Emotions ga మారుతుందని  అనుకోలేదు 



                                   అనుకోకుండా ఆరోజు
                                  (Inter and B.Tech life ) 
                                  అతి త్వరలో........... 

Realization

"Knowing yourself where you will be Shine 🔆 " Is the Real Realization 😊

వచ్చాయి వానలు.💧☔💧 ....గుర్తొచ్చాయి నాలోని జ్ఞాపకాలు😍😍

వచ్చాయి ఋతుపవనాలు .... తెచ్చాయి ప్రకృతికి అందాలు...... బురదలో అడుగులు   బూడిదలో నీటి చుక్కలు   ఆకాశంలో మెరుపులు   నేలపై నీటి గుంటలు   కొండ చ...